మరో విజయంపై కుర్రాళ్ల గురి.. బంగ్లాతో ఇవాళ (జనవరి 17) యంగ్ ఇండియా ఢీ

మరో విజయంపై కుర్రాళ్ల గురి.. బంగ్లాతో ఇవాళ (జనవరి 17) యంగ్ ఇండియా ఢీ

బులవాయో (జింబాబ్వే): అమెరికాను చిత్తు చేసి ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఘనంగా ఆరంభించిన డిఫెండింగ్ చాంపియన్ ఇండియా తన జైత్రయాత్రను కొనసాగించేందుకు సిద్ధమైంది. శనివారం జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిరకాల ప్రత్యర్థి బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది. 

గురువారం జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 వికెట్ల తేడాతో అమెరికాపై ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న ఆయుష్ మాత్రే కెప్టెన్సీలోని యంగ్ ఇండియా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. గత పోరులో వర్షం అంతరాయం కలిగించినప్పటికీ ఇండియా బౌలర్లు అమెరికాను 107 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూల్చారు. ఐదు వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ హెనిల్ పటేల్‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ కీలకం కానున్నాడు.