
అమీర్‌పేట్ చౌరస్తాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం రాత్రి ఇద్దరు యవకులు ద్విచక్రవాహనంపై కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట్ వైపు వేగంగా వస్తున్నారు. వీరి వాహనం అంబేడ్కర్ చౌరస్తా వద్దకు రాగానే అదుపు తప్పి ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడి తల మెట్రో గ్రిల్‌లో ఇరుక్కుని అక్కడిక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు చనిపోయిన యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
For More News..