ఇంట్లోంచి వెళ్లిపోయిన తండ్రి.. కారణం తానేనని యువకుడు సూసైడ్.. హైదరాబాద్ బడంగ్పేట్ లో ఘటన

ఇంట్లోంచి వెళ్లిపోయిన తండ్రి.. కారణం తానేనని యువకుడు సూసైడ్.. హైదరాబాద్ బడంగ్పేట్ లో ఘటన

ఓల్డ్​సిటీ, వెలుగు: తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి తానే కారణమని ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన బుయ్యకర్ చంద్రశేఖర రావు (25) గత నెల తన తండ్రి రవీందర్​తో గొడవపడ్డాడు. ఆ తర్వాత తండ్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు చంద్రశేఖర్​ను మందలించారు. 

దీంతో చంద్రశేఖర్ ఈ నెల 1న ఇంటి నుంచి వచ్చేసి హైదరాబాద్ కర్మాన్​ఘాట్​లో అద్దె గదిలో ఉంటున్నాడు. ఎంతకీ తండ్రి తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం బడంగ్​పేట్ ప్రధాన రహదారి పక్కన వైన్ షాప్ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని సజీవ దహనమయ్యాడు. 

 స్థానికులు మృతదేహాన్ని గమనించి సమాచారం అందించడంతో మీర్ పేట్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్​స్పెక్టర్​బండారి శోభన్ తెలిపారు.