అమ్నేషియా పబ్ ఘటన మరవకముందే మరో దారుణం

అమ్నేషియా పబ్ ఘటన మరవకముందే మరో దారుణం

అమ్నేషియా పబ్ ఘటన మరవకముందే హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఫ్రెండ్స్ తో కలిసి పబ్ కు వెళ్లిన యువతి పట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుచెప్పిన యువతి ఫ్రెండ్ తలపగలగొట్టారు.  శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి ఓ యువతి ఇద్దరు స్నేహితులతో కలిసి  ఐటీసీ కోహినూర్ ఓటినో బార్ అండ్ పబ్ కు వెళ్లింది. అయితే కొందరు యువకులు..యువతిని నంబర్ ఇవ్వమని అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించిన్నట్లు ఆమె ఫ్రెండ్స్ తెలిపారు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే రేప్ చేస్తామని బెదిరించారని..బీర్ బాటిల్ తో తలపగలగొట్టారని తెలిపారు. దీనిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. బార్ అండ్ పబ్ రిక్వెస్ట్ తో ముందు కంప్లైంట్ ఇవ్వలేదని..సీసీ కెమెరాలో చూస్తూ అన్ని నిజాలు తెలుస్తాయని తెలిపారు.