ముషీరాబాద్ లో యువతిపై కత్తితో దాడి 

ముషీరాబాద్ లో యువతిపై కత్తితో దాడి 

హైదరాబాద్ ముషీరాబాద్ లోని  బోలక్ పూర్ లో  యువతిపై కత్తితో దాడి  చేశాడు రంజిత్  అనే యువకుడు. యువతి చేతికి తీవ్ర గాయాలు కావడంతో  కాచిగూడలోని  పాతిమా హాస్పిటల్ కు తరలించారు. బాధితురాలు ముషీరాబాద్ లో  డిగ్రీ చదువుతున్నట్లు తెలుస్తోంది.  గాయపడిన యువతి , రంజిత్  కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు  తెలుస్తోంది. ఇద్దరు  నిన్న సాయంత్రం ఉస్మానియా  వర్సిటీలోని  మంజీర హాస్టల్  దగ్గర కలుసుకున్నారు. ఇద్దరి మధ్య  గొడవ జరిగింది.  మాటామాట  పెరగడంతో  రంజిత్ యువతిపై  కత్తితో  దాడి చేసి  పరారయ్యాడు  .పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మంజీర హాస్టల్ దగ్గర కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అంతలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ..పదునైన ఆయుధంతో యువతిపై రంజిత్ దాడి చేశాడు. అతడిని అడ్డుకునే క్రమంలో ఆమె రెండు చేతులకు గాయాలయ్యాయి. పెళ్లికి యువకుడు నిరాకరించడంతోనే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. లేకపోతే మరైదేనా కారణాలు ఉన్నాయనే విషయం తెలియాల్సి ఉంది.