సోనుసూద్ ను కలిసేందుకు 700 కిమీ నడిచిన అభిమాని

సోనుసూద్ ను కలిసేందుకు 700 కిమీ నడిచిన అభిమాని

సోనూసూద్.. కరోనా కష్టకాలంలో దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న ఏకైక రియల్ హీరో. కష్టాల్లో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తూ..  కన్నీళ్లు తుడుస్తూ.. ఆకలి దప్పులు తీరుస్తూ.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నిజజీవితపు హీరో ప్రభావం రోజు రోజూకూ పెరిగిపోతోంది. సోనూ సూద్ కార్యక్రమాలతో ఉత్తేజం పొందిన తెలంగాణలోని వికారాబాద్ కు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఇంతవరకు అతని కోసం ఎవరూ చేయసి సాహసం చేశాడు. 
దాదాపు 700 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. వీపుకు రెండు జతల గుడ్డలున్న బ్యాగు తగిలించుకుని... సోనూ సూద్ పోటోతో ఉన్న ప్లకార్డు చేతపట్టి చలో ముంబై అంటూ బయలుదేరాడు. ‘‘రియల్ హీరో సోనూ సూద్.. టైటిల్ కింద నా గమ్యం.. నా గెలుపు ట్యాగ్ లైన్ తో..హైదరాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర అని రాసిన ప్లకార్డుతో పాదయాత్ర’’ చేశాడు. 
తన అభిమాన నటుడిని కలవడానికి వికారాబాద్ నుంచి ముంబై వెళ్లిన అభిమాని వెంకటేష్ మార్గం మధ్యలో ఎండా కాలం తీవ్ర కష్టాలు చవిచూశాడు. లాక్ డౌన్ కారణంగా ఎక్కడా సరైన ఆహారం దొరక్కున్నా.. దొరికింది తిని కడుపు నిండిన వెంటనే కాలినడకన ముందుకు సాగాడు. ఎంతో శ్రమకోర్చి ముంబై మహానగరం చేరుకున్న యువకుడికి సోనూసూద్ ఇంటి చిరునామాను స్థానికులే అడుగడుగునా దారి చూపిస్తూ ప్రోత్సహించారు. తన కోసం కాలినడకన 700 కిలోమీటర్లు నడుస్తూ వస్తున్న అభిమాని కోసం  సోనూసూద్ స్వయంగా ఇంటి గేటు వద్దకు వచ్చాడు.

వచ్చీ రావడంతోనే తన కాళ్లకు దండం పెట్టిన అభిమాని వెంకటేష్ ను వారించి అక్కున చేర్చుకున్నాడు సోనూసూద్. ఎందుకింత కష్టపడ్డావంటూ చలించిపోయాడు. అభిమాని వెంకటేష్తో ఫోటో దిగి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఇంత దూరం ఎందుకు రావడం.. నేనే హైదరాబాద్ కు వస్తుంట కదా.. అంటూ సున్నితంగా వారించాడు సోనూ సూద్. ఏం చేస్తుంటావని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఈసారి హైదరాబాద్ కు వచ్చినప్పుడు కలుద్దామంటూ అభిమాని వెంటకేష్ కు హామీ ఇచ్చాడు. అయితే ఎవరూ ఇలా చేయొద్దంటూ.. మీ పక్కన .. మీకు దగ్గరలో ఉన్న వారిని ఆదుకునే కార్యక్రమాలు చేపట్టాలని సూచించాడు సోనూసూద్.