యంగ్ స్టర్స్ కీలకం

యంగ్ స్టర్స్ కీలకం

క్రైస్ట్‌‌‌‌చర్చ్‌‌: వన్డే వరల్డ్‌‌కప్‌‌లో నలుగురు యంగ్‌‌ ప్లేయర్లు తమ టీమ్‌‌లో కీలకం కానున్నారని ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌ కెప్టెన్‌‌ మిథాలీ రాజ్‌‌ చెప్పింది. మెగా టోర్నీకి ముందు యంగ్‌‌స్టర్స్‌‌కు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌‌లు ఆడే చాన్స్‌‌ ఇచ్చామంది. షెఫాలీ వర్మ, రిచా ఘోష్ తో పాటు మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్ గొప్ప పెర్ఫామెన్స్ చేశారని కొనియాడింది. మార్చి 4న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అందులో భాగంగా ఆదివారం నుంచి వామప్‌‌ మ్యాచ్‌‌లు జరగనున్నాయి. ఇందులో టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ క్రమంలోనే ఇండియా ప్లాన్స్ గురించి మిథాలీ మీడియాతో పంచుకుంది. ‘వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ లో భాగంగా కొంతమంది యంగ్ ప్లేయర్లకు ఏడాది కాలంగా అవకాశాలు కల్పించాం. వారిలో రిచా, షెఫాలీ వర్మ, మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్ సూపర్ గా ఆడారు. వీరందరికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం వల్ల కెప్టెన్ గా వారు టీమ్ లో ఎక్కడ యూజ్ అవుతారన్న దానిపై క్లారిటీ వచ్చింది. వామప్‌‌ మ్యాచ్ లోనూ అందరికీ సరైన ప్రాక్టీస్ లభించేలా చూస్తా. ఇప్పటివరకు నేను చేసిన రన్స్ పట్ల హ్యాపీగా ఉన్నా. వరల్డ్ కప్ లోనూ ఇదే ఫామ్ ను కంటిన్యూ చేయాలనుకుంటున్నా. మెగా టోర్నీల్లో ఆడేటప్పుడు యంగ్ ప్లేయర్లు ఒత్తిడితో కాకుండా ఎంజాయ్ చేస్తూ ఆడాలి. అనుభవజ్ఞులతో పాటు యంగ్ స్టర్స్ కూడా ఉండటం వల్ల టీమ్ బ్యాలెన్స్ గా కనిపిస్తోంది. ఫీల్డింగ్ లోనే మేము ఇంకాస్త మెరుగవ్వాలి’ అని మిథాలీ పేర్కొంది. 
 

మరిన్ని వార్తలు