Jr NTR: నారా లోకేష్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన జూనియర్ ఎన్జీఆర్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ట్వీట్!

Jr NTR: నారా లోకేష్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన జూనియర్ ఎన్జీఆర్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ట్వీట్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ .. యువతకు ఆశాకిరణంగా నిలుస్తున్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం 43వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే, అందరి దృష్టిని ఆకర్షిస్తూ 'యంగ్ టైగర్' జూనియర్ ఎన్టీఆర్ పంపిన బర్త్ డే విషెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తారక్ స్పెషల్ విషెస్

నందమూరి, నారా కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా మంత్రి లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.  రాబోయే ఏడాది మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది, ఇరు కుటుంబాల అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

 

బ్రాహ్మణి ఎమోషనల్ నోట్

లోకేష్ భార్య, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తన భర్త గురించి ఒక హృద్యమైన పోస్ట్ షేర్ చేశారు. ప్రజా సేవ కోసం లోకేష్ పడుతున్న శ్రమను, చేస్తున్న త్యాగాలను ఆమె కొనియాడారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, బాధ్యతాయుతమైన భర్తగా, తండ్రిగా ఆయన చూపే ప్రేమని ఆమె గుర్తుచేసుకున్నారు.

 

పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ పనితీరును ప్రశంసిస్తూ ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో లోకేష్ తీసుకొస్తున్న సంస్కరణలు, ఐటీ హబ్‌ల ద్వారా సృష్టిస్తున్న ఉద్యోగ అవకాశాలను ఆయన అభినందించారు. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చడంలో లోకేష్ విజన్ గొప్పదని కొనియాడారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళేందుకు మరింత శక్తిని, సుఖసంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని అని పవన్ కళ్యాణ్  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.