
కొత్తకోట, వెలుగు: మరొకరికి తో పెళ్లైన ప్రియుడితో తనకు పెళ్లి జరిపించాలని మహబూబ్ నగర్ జిల్లా మదనాపురం మండలం రామన్ పాడ్ లో తిరుమలాయపల్లికి చెందిన ఓ యువతి సెల్ టవర్ ఎక్కి హాల్ చల్ చేసింది. శనివారం 100 రోజుల పనికి వెళ్లిన యువతి దగ్గరలో ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కి తన ప్రియుడితో వివాహం జరిపించాలని డిమాండ్ చేసింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ మంజునాథ్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. ఐదు గంటల పాటు యువతి కిందికి దిగలేదు. ఆహారం తీసుకోకపోవడంతో నీరసంగా ఉన్న యువతిని బలవంతంగా స్థానికుల సాయంతో తాళ్లను కట్టుకొని కిందికి దింపారు. అనంతరం మదనాపురంలో ఉన్న ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లారు.