పెళ్లి కావడంలేదనే మనస్తాపంతో యువతి సూసైడ్

పెళ్లి కావడంలేదనే మనస్తాపంతో యువతి సూసైడ్

హైదరాబాద్: యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం హైదరాబాద్ లో జరిగింది. కెపీహెచ్‌బీ పోలీస్ ‌స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్‌లో స్వప్న(22) అనే యువతి నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని స్వప్న సూసైడ్ చేసుకుంది. తనకు వివాహ సంబంధాలు కుదరటం లేదనే మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు కుటుంబ సభ్యులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.