
మల్కాజిగిరి, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు నేరేడ్మెట్ సీఐ సందీప్ కురుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నేరేడ్మెట్ కాకతీయ నగర్‌కు చెందిన మంజుల సుబ్బారావు(20) తాపీ మేస్త్రీ. గురువారం మధ్యాహ్నం బైక్‌పై సఫిల్‌గూడ వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యలో సడెన్ గా బ్రేక్ వేయడంతో సఫిల్‌గూడ నుంచి నేరేడ్మెట్ వైపు వెళ్తున్న కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కింద పడ్డాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.