కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్ లండన్లో అనుమానాస్పదస్థితిలో చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్లకు చెందిన సావుసాని మంజుల, మధుసూదన్ రెడ్డి కొడుకు శ్రీనాథ్‌రెడ్డి(25) ఎంఎస్ చేసేందుకు 14 నెలల కింద లండన్ వెళ్లాడు.
అక్కడి లీసెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండ్ ఇయర్చదువుతున్నాడు. బుధవారం తన ఫ్రెండ్బర్త్డే పార్టీకి వెళ్లిన శ్రీనాథ్‌రెడ్డి రాత్రి ఫ్రెండ్ రూమ్ లోనే పడుకున్నాడు. మర్నాడు ఉదయం ఎంతకూ లేవకపోవడంతో అతడి స్నేహితులు పరిశీలించగా చనిపోయి కనిపించాడు.
వెంటనే వారు లండన్‌లోనే ఉంటున్న శ్రీనాథ్‌రెడ్డి బంధువులకు సమాచారం ఇచ్చారు. శ్రీనాథ్‌రెడ్డి చనిపోయిన విషయాన్ని అతడి బంధువులు కామారెడ్డిలోని ఫ్యామిలీ మెంబర్స్‌కు చెప్పారు. శ్రీనాథ్ రెడ్డి ఎలా చనిపోయాడో తమకు ఇంకా తెలియడం లేదని కుటుంబసభ్యులు చెప్తున్నారు. శ్రీనాథ్డెడ్బాడీని తలమడ్లకు తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
