హ్యాట్సాఫ్.. రోడ్డుపై దొరికిన డబ్బుల బ్యాగ్.. ఈ యువకుడు ఏం చేశాడో చూడండి

హ్యాట్సాఫ్.. రోడ్డుపై దొరికిన డబ్బుల బ్యాగ్.. ఈ యువకుడు ఏం చేశాడో చూడండి

రోడ్డుపై డబ్బులు దొరికితే ఎవ్వరికి తెలియకుండా సైలెంట్ తీసుకొని వెళ్తుంటారు కొందరు.. కానీ అందరికీ భిన్నంగా ఓ యువకుడు అతనికి రోడ్డుపై దొరికిన డబ్బును పోలీసులకు అప్పగించాడు. 

హైదరాబాద్ కేపీహెచ్ బీ కూకట్ పల్లిలో ఓ యువకుడు తన నిజాయితీ చాటుకున్నాడు. రోడ్డుపై దొరికిన  డబ్బు బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. దీంతో యువకుడి నిజాయితీని పోలీసు అధికారులు ప్రశంసించి.. సన్మానించారు. కేపీహెచ్ బీ కాలనీలో ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్ లో పనిచేసే మహేష్ కుమార్ చారికి.. అత్యంత రద్దీగా ఉంటే 9వ ఫేస్ లో ఒక బ్యాగ్ కనిపించింది. దీంతో ఆ బ్యాగ్ తెరచి చూడగా అందులో 48 వేల 300 రూపాయలు ఉన్నాయని.. ఆ బ్యాగును నేరుగా కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. నగదును స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంకన్నకు అందజేశాడు మహేష్ చారి. ఈ సందర్భంగా మహేష్ ని అభినందించారు.