మార్కెట్‌‌ ఇన్వెస్ట్​మెంట్లలో యూత్‌‌ హవా!

మార్కెట్‌‌ ఇన్వెస్ట్​మెంట్లలో యూత్‌‌ హవా!

న్యూఢిల్లీ: కరోనాతో మార్కెట్‌‌లో కొత్త ఇన్వెస్టర్లు ఫుల్‌‌గా పెరిగారు. మార్కెట్‌‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్లు అసలు వెనక్కి తగ్గడం లేదని జెరోధా ఫౌండర్, సీఈవో నితిన్ కామత్ అన్నారు. టాప్ 20 సిటీల్లో కొత్త ట్రేడర్లపై తాము ఎక్కువగా ఫోకస్‌‌ పెట్టినట్టు చెప్పారు. తమ వ్యాపారాల్లో ఎక్కువ భాగం హైదరాబాద్, బెంగళూరు, పుణే, ముంబై వంటి పెద్ద నగరాలకు చెందిన ఇన్వెస్టర్లే ఉన్నారని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ట్రేడర్స్ ట్రెండ్ ఎలా ఉంది..? సెప్టెంబర్ డేటా, ఇండికేటర్స్ ఏం చెబుతున్నాయి..?

ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్లను, అలవాటుగా ట్రేడింగ్‌ చేసేవాళ్లను  చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఏప్రిల్, మే, జూన్‌‌ నెలల్లో చాలా మంది కస్టమర్లు మా ప్లాట్‌‌ఫామ్‌‌పై చేరారు. ఇంకా కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్‌‌లో చేరుతూనే ఉన్నారు.  మార్కెట్ పడిపోతే.. ఇంటరస్ట్ తగ్గుతుందని నేను అనుకున్నా కానీ అలాంటిదేమీ ఇప్పటి వరకు జరగలేదు. మార్కెట్‌‌లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.

ఎలాంటి ఇన్వెస్టర్లు కొత్తగా మార్కెట్‌‌లోకి వస్తున్నారు? ఏదైనా స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ ఉందా..?

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి వరకు డేటాను తీసుకుంటే.. 70–75 శాతం కస్టమర్లు 30 ఏళ్ల లోపు వారే. వీరిని మీరు మిలీనియల్ ఇన్వెస్టర్లుగా పిలవచ్చు. మధ్యవయస్కుల్లో ఇప్పటికే చాలా మందికి డీమ్యాట్ అకౌంట్లు, ట్రేడింగ్ అకౌంట్లు ఉన్నాయి. వీరు కూడా తిరిగి ఇప్పుడు ఇన్వెస్ట్‌‌ చేయాలనుకున్నా, ట్రేడింగ్ చేయాలనుకున్నా కూడా కుదురుతుంది. 20–30 ఏళ్ల వారిలో 60 శాతం మంది ఇప్పటి వరకు ఎలాంటి ఇన్వెస్ట్‌‌మెంట్లు పెట్టి ఉండరు. మేమే వారికి తొలి వెహికల్‌‌గా మారుతున్నాం. అంతకముందు మ్యూచువల్ ఫండ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్స్ పెట్టని వారు కూడా మా వద్ద ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు.

హైదరాబాద్, పుణే, బెంగళూరు వంటి టెక్నాలజీ లీడ్‌‌ ఉన్న నగరాలు మీకు టార్గెట్  అని చెప్పారు కదా.. అక్కడ గ్రోత్ ఇప్పుడెలా ఉంది..?

అడ్రస్ ప్రూఫ్స్ ప్రకారం మేము యూజర్లను ట్రాక్ చేస్తున్నాం. అయితే ఒక ప్లేస్ అడ్రస్ ఇచ్చి, మరో ప్లేస్‌‌లో ఉంటే.. ట్రాక్ చేయడం తేలిక కాదు. ఒకవేళ శివమొగ్గ అడ్రస్ ఇచ్చి, బెంగళూరులో ఉంటే.. యూజర్ గ్రోత్ టైర్ 2 లేదా టైర్ 3 సిటీలో చూపిస్తోంది. ఐపీ అడ్రస్ ప్రకారం యూజర్‌‌ను ట్రాక్ చేయాలనుకుంటున్నాం. ఇది పెద్ద మొత్తంలో ఇంటెలిజెంట్ ఇన్‌‌ఫర్మేషన్‌‌ను ఇస్తుంది. 20–30 ఏళ్ల వారు జాబ్స్ కోసం చిన్న నగరాల నుంచి పెద్ద నగరాలకు వస్తున్నారు. కానీ వారు ఆధార్ వంటి ఇతర అడ్రస్ ప్రూఫ్‌‌లలో అడ్రస్ మార్చుకోవడం లేదు. దీంతో కేవలం అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటే డేటా కాస్త గజిబిజీగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్, పుణే, బెంగళూరు, ముంబై ప్రాంతాలు మాకు పెద్ద మొత్తంలో బిజినెస్‌‌లు ఇస్తున్నట్టు భావిస్తున్నాం.

మార్కెట్ షేరునును పెంచుకునేందుకు మీ దగ్గరున్న ప్లాన్ల గురించి చెబుతారా ?

ప్రొడక్టే మాకు ముఖ్యం. మంచి ప్రొడక్ట్‌‌   కస్టమర్లను తప్ప ఆకట్టుకుంటుంది. ప్రొడక్ట్‌‌ను మినహాయించి మిగిలిందంతా కూడా బ్రోకర్లందరూ సమానంగా ఆఫర్ చేస్తారు. ఏ బ్రోకర్ వద్ద మంచి ప్రొడక్ట్ , బెటర్ ప్లాట్‌‌ఫామ్స్, ఇనీషియేటివ్స్ ఉంటే.. వారు మరింత ముందుకు వెళ్తారు. మేము 24 గంటలు పాటు పనిచేస్తున్నాం. మా ప్రొడక్ట్‌‌ను మరింత మెరుగుపర్చుతున్నాం.