తమిళనాడును తాకిన అగ్నిపథ్ సెగలు

తమిళనాడును తాకిన అగ్నిపథ్ సెగలు

సైనిక నియామకాల కోసం అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిని రాజేసింది. రోజుకో రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ స్కీంపై అన్ని ప్రాంతాల అభ్యర్థుల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్న బిహార్ లో.. నిన్న సికింద్రాబాద్ లో అలజడులు సృష్టించిన యువత.. నేడు తమిళనాడులోనూ వార్ మెమొరియల్ వద్ద నిరనస చేపట్టారు. నిన్న, మొన్న ఆందోళనకారులు సృష్టించిన అలజడులతో పలు రైళ్లు బూడిదయ్యాయి. బస్సులు ధ్వంసమయ్యాయి. మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. కొందరికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా..  మరొకరికి మృతి చెందారు. ఇప్పుడు ఈ నిరసన సెగలు తమిళనాడునూ వ్యాపించాయి. అక్కడా అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి.. నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రహదారుల మీదే కసరత్తులు చేస్తూ.. అగ్నిపథ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆందోళన చేస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాగే కొనసాగితే.. అగ్నిపథ్ మంటలు రోజుకో రాష్ట్రానికి పాకి... దేశం అల్లకల్లోలం అవుతుందేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.