త్రినాధ్ కటారి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఇట్లు మీ వెదవ’. సాహితీ అవాంచ హీరోయిన్. బళ్లారి శంకర్ నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తుది దశలో ఉన్న ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. నైజాంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుండగా, ఆంధ్ర, సీడెడ్‌లో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రిలీజ్ చేయనుంది. ఈ రెండు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతోందని శుక్రవారం మేకర్స్ తెలియజేశారు. ఈ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.
