తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్

తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. పబ్లిసిటీ కోసం రీల్స్ చేసే యూట్యూబర్లు ఎక్కువగా ఇలాంటి న్యూస్ ను షేర్ చేస్తున్నారు. యూట్యూబర్లు తమ ఛానెల్ సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. తాజాగా తప్పుడు వార్తలు  షేర్ చేసిన ఓ యూట్యూబర్ ను ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.   

బెంగళూరులోని కెంపెగైడ్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో 24 గంటలపాటు గడిపానని వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన యూట్యూబర్ వికాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. యెలహంక కు చెందిన వికాస్ గౌడ ఏప్రిల్ 7న మధ్యా హ్నం 12.06 గంటల ప్రాంతంలో ఎయిర్ ఇండియా బెంగళూరు -చెన్నై  టికెట్ కొనుగోలు చేసి ఎయిర్ పోర్టులోకి వెళ్లాడు. ఫ్లైట్ ఎక్కకుండా  ఎయిర్ పోర్టు పరిసరాలు మొత్తం తిరిగాడు. అంతేకాదు మొబైల్ ఫోన్ లో వీడియో రికార్డు చేశాడు.  

ఏప్రిల్ 12 న వికాస్ గౌడ తన యూబ్యూటర్ ఛానెల్ (@VikasGowda1)  లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. తాను 24 గంటలు ఎయిర్ పోర్టులోనే గడిపానని.. ఎయిర్ పోర్టు మొత్తం తిరిగాను..నన్ను ఎవరూ పట్టుకోలేదు.. కనీసం చెకింగ్ కూడా చేయలేదు.. ఇది ఎయిర్ పోర్టు భద్రత సిబ్బంది లోపం అని షేర్ చేశాడు. 1.13 లక్షల మంది సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్న  వికాస్ గౌడ ఛానెల్ లో ఈ వీడియోను షేర్ చేసి ఎయిర్ పోర్టులో భద్రత లోపించింది రాశాడు. ఈ వీడియో అయిన తర్వాత ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ వింగ్  సెంట్రల్ ఇండస్ట్రీయిల్ సెక్యూరిటీ ఫోర్ ఈ విషయాన్ని తెలుసుకొని ఏప్రిల్ 15న అతనిపై ఫిర్యాదు చేసింది. వికాస్ గౌడ తప్పుడు సమాచారం షేర్ చేశాడని ఫిర్యాదులో తెలిపింది. 

also read : మోదీతో విజయన్ రహస్య ఒప్పందం : సీఎం రేవంత్ రెడ్డి

వికాస్ గౌడ్ కేవలం  నాలుగైదు గంటలు మాత్రమే ఎయిర్ పోర్టులో ఉన్నాడు.. కానీ విమానంలో చెన్నైకి వెళ్లలేదు.. ఇది దేశీయ విమాన సంస్థ అయినందున ఇమ్మిగ్రేష న్ ద్వారా వెళ్లనవసరం లేదని ఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. 

పబ్లిసిటీ కోసమే వికాస్ గౌడ్ అలా చేశాడని తమ ఇన్వెస్టిగేషన్ లో తేలిందని పోలీసులు చెప్పారు. వికాస్ గౌడపై ఐపీసీ సెక్షన్ 505, సెక్షన్ 448 కింద కేసు నమోదు చేశామన్నారు పోలీసులు.. సో.. యూట్యూబర్లు జర జాగ్రత్త ..లేకుంటే జైల్లో ఊసలు లెక్కపెట్టాల్సి వస్తుంది.