కంత్రీగాడు : కారులో గంజాయి పెట్టి.. పోలీసులకు పట్టించిన యూట్యూబర్

కంత్రీగాడు : కారులో గంజాయి పెట్టి.. పోలీసులకు పట్టించిన యూట్యూబర్

నీచాతి పరమ నీచుడు ఎలా ఉంటాడు అంటే వీడిని చూపించొచ్చు.. తనకు ఇష్టం లేని వ్యక్తిని గంజాయి కేసులో ఇరికించటానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టటంతో.. ఇప్పుడు కటకటాలపాలయ్యాడు. అన్నెంపున్నెం ఎరుగని ఆ వ్యక్తి.. అదృష్టం బాగుండి బయటపడ్డాడు కానీ.. లేకపోతే ఆ కుటుంబం ఏమయ్యాదో కదా.. హైదరాబాద్ సిటీ శివార్లలో ఓ యూట్యూబ్ ఛానెల్ విలేకరిగా చెలామణి అయ్యే ఓ వ్యక్తి.. మరో వ్యక్తితో కలిసి ప్లాన్ చేసిన దుర్మార్గపు పథకం ఏంటో తెలుసుకుందామా..

వికారాబాద్ జిల్లా పరిగిలో  యుజెఫ్ అనే యువకుడు సతీష్ అనే యూట్యూబర్ తో  కలిసి  పెద్ద స్కెచ్ వేశాడు.  తనకు పడిని ఓ వ్యక్తిని గంజాయి కేసులో ఇరికించాలని అనుకున్నాడు. అందులో భాగంగా...  మెడికల్ షాపు నడిపే ఓ యువకుడి కారులో గంజాయి పెట్టాడు. అంతే ఓకే అనుకున్నాక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో  పోలీసులు మెడికల్ షాపు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  విచారణలో తనకు ఈ గంజాయికి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పాడు. 

Also Read: మీలాంటి పెద్ద కంపెనీనే తీస్తే..ఉద్యోగులు ఎలా బతకాలి

దీంతో సీసీ కెమారాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా..  యుజెఫ్ గంజాయి కారులో పెట్టె దృశ్యాలు అందులో రికార్డయ్యాయి.  .యుజెఫ్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా సదరు యూట్యూబర్ పెట్టమంటేనే  కారులో గంజాయి పెట్టానని వీస్తుగొలిపే నిజాలు చెప్పాడు. దీంతో  గంజాయి అమ్మిన వ్యక్తి, యుజెఫ్ కు గంజాయి తెచ్చి ఇచ్చిన వ్యక్తిని, గంజాయి పెట్టమని ప్రోత్సహించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.