IT Layoffs : మీలాంటి పెద్ద కంపెనీనే తీస్తే..ఉద్యోగులు ఎలా బతకాలి

IT Layoffs : మీలాంటి పెద్ద కంపెనీనే తీస్తే..ఉద్యోగులు ఎలా బతకాలి

గతేడాది కాలంగా టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులను లేఆఫ్స్ భయం పట్టిపీడిస్తోంది.ఉన్నట్టుండి కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటంతో తమ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడుతాయో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు టెకీలు. 2023లో ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు. ఈ ఏడాది కూడా  భారీ మొత్తంలోనే ఉద్యోగుల తొలగింపులు ఉండొచ్చని టెక్ నిపుణులు చెపుతున్నారు. ఊహించినట్లుగానే 2024లో కూడా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి కంపెనీలు.. తాజాగా టెక్ రంగంలో జెయింట్ కంపెనీ అయిన  డెల్ కూడా మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. 

Also Read: కారులో గంజాయి పెట్టి.. పోలీసులకు పట్టించిన యూట్యూబర్

ప్రముఖ ల్యాప్ టాప్లు, కంప్యూటర్ల ఉత్పత్తి కంపెనీ డెల్ తన ఉద్యోగుల్లో కొంతమందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సోమవారం(మార్చి 25)  ప్రకటించింది. దాదాపు 6వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ చెప్పనుంది. దీంతో పాటు కొత్త రిక్రూట్ మెంట్ కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. గత రెండు సంవత్సరాలుగా డెల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గడంతో నాల్గవ త్రైమాసికంలో 11 శాతం రెవెన్యూ తగ్గిందని ప్రకటించింది. గతేడాది కూడా 6వేల 500 ఉద్యోగులను తొలగించింది డెల్ కంపెనీ.దీంతో కంపెనీకి చెందిన టెకీలు ఆందోళనలో ఉన్నారు.