వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి 6 రోజుల సీబీఐ కస్టడీ

వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి 6 రోజుల సీబీఐ కస్టడీ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ కు కస్టడి విధించింది సీబీఐ కోర్టు. ఇద్దరికి ఆరు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుతిచ్చింది. ఏప్రిల్ 19 నుంచి 24 వరకు  సీబీఐ కస్టడీలో ఉండనున్నారు ఉదయ్ కుమార్, భాస్కర్ రెడ్డి. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఉదయ్, భాస్కర్ రెడ్డిలను న్యాయవాదుల సమక్షంలోనే ప్రశ్నించాలని సీబీఐ కోర్టు సూచించింది.

మరో వైపు ఇదే కేసులో ఎంపీ అవినాష్  రెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్  మంజూరు చేసింది హైకోర్టు.  ఏప్రిల్ 25 వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐని  హైకోర్టు ఆదేశించింది. 25 వరకు అవినాష్ రెడ్డిని ప్రతి రోజు విచారించాలని చెప్పింది. ప్రతి రోజు అవినాష్ రెడ్డి విచారణ, ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని చెప్పింది.  విచారణ సమయంలో ప్రశ్నలను లిఖితపూర్వకంగానే ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది కోర్టు. ఏప్రిల్ 25వ తేదీన కేసులో తుది తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు.