వైసీపీ అధినేత జగన్ పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని.. ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని అన్నారు. ఇకపై ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని..ఏలూరు నియోజకవర్గంతోనే మొదలుపెట్టనున్నామని అన్నారు జగన్. ఫిబ్రవరి లేదా మార్చిలో బడ్జెట్ సెషన్స్ పెడుతున్నారని.. ఈ ప్రభుత్వానికి మిగిలింది మరో రెండు బడ్జెట్ లు మాత్రమేనని అన్నారు.
రెడ్ బుక్‌తో ఏదైనా చేయొచ్చనే అహంకారంతో కూటమి నేతలు ఉన్నారని.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు జగన్. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని.. అందుకే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారని.. సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవన్ లేదు, అన్నీ మోసాలేనని అన్నారు జగన్.
గవర్నమెంట్ స్కూళ్ళు కల తప్పాయని.. గోరుముద్ద క్వాలిటీ లేకుండా పోయిందని అన్నారు జగన్. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్‌లో పెట్టారని.. ఆరోగ్యశ్రీని కనుమరుగు చేశారని అన్నారు. 108, 104 సేవలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు జగన్. తమ ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తే.. ఈ ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోందని అన్నారు జగన్.
