ఏపీలో ధర్మం, అధర్మం మధ్య పోటీ : జగన్

ఏపీలో ధర్మం, అధర్మం మధ్య పోటీ : జగన్

ఏపీలో ధర్మం, అధర్యం మధ్య పోటీ జరుగుతోందన్నారు వైసీపీ అధినేత జగన్. ఒకసారి అవకాశం ఇస్తే.. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామన్నారు జగన్. ఆదివారం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశానన్నారు. ప్రతి పేదకుటుంబాన్ని లక్షాధికారిగా మారుస్తామన్నారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మొద్దన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం ఉందన్న ఆయన.. వైఎస్సార్‌ చేయూత కింద మహిళలకు రూ.75 వేలు ఇస్తామన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని… అక్కా చెల్లెమ్మలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పారు. రైతులకు పెట్టుబడి కింద రూ.12 వేల 500 చొప్పున నాలుగేళ్లు చెల్లిస్తామని తెలిపారు. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయని పెన్షన్‌ రూ.2వేలు ఇస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పెన్షన్‌ రూ.3వేలు పెంచుతామని తెలిపారు జగన్.