
హైదరాబాద్ లో బోనాల పండగ సందడి నెలకొంది. నగర మంతటా ఎక్కడ చూసినా పండగ శోభే కనిపిస్తోంది. భక్తులతో అమ్మ వారి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎష్ షర్మిల మొయినాబాద్ లో అమ్మవారికి బోనం సమర్పించారు. ఆషాడ మాస బోనాల సందర్భంగా వైఎస్ఆర్ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించారు. మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళవారం గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితురాలు రజిని నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్నారు. బోనాల పండగతో పాటు ఇవాళే స్నేహితుల దినోత్సవం. అందుకే తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి ఫ్రెండ్ షిప్ డేతో పాటు బోనాల వేడుకల్లో పాల్గొన్నట్లు షర్మిల తెలిపారు.