పొత్తులు, తొత్తులకు ఓటు వేయడం అవసరమా.. జగన్, చంద్రబాబులపై షర్మిల ఫైర్..

పొత్తులు, తొత్తులకు ఓటు వేయడం అవసరమా.. జగన్, చంద్రబాబులపై షర్మిల ఫైర్..

2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. కాగా, ఎన్నికలకు నెలరోజుల సమయం కూడా లేకపోవటంతో నేతలంతా ప్రచారం ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మడకశిరలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల జగన్, చంద్రబాబులను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. -ఇంత కాలం జగన్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన షర్మిల ఇప్పుడు చంద్రబాబును కూడా టార్గెట్ చేయటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మడకశిర ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని గొప్పలు చెప్పారు తప్ప, ఒక్క కంపెనీ కూడా రాలేదని అన్నారు. గత పదేళ్లుగా టీడీపీ, వైసీపీలు రాష్ట్రాన్ని ,మోసం చేశాయని అన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిదని, హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని అన్నారు. హోదా విషయంలో బీజేపీ రాష్ట్రానికి మోసం చేసిందని, అలాంటి బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే, జగన్ బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ పొత్తులకు, తొత్తులకు ఓటు వేయడం అవసరమా అని మండిపడ్డారు షర్మిల.