దున్నపోతు మీద వానపడ్డట్లుగా కనీసం పట్టించుకోలేదు

దున్నపోతు మీద వానపడ్డట్లుగా కనీసం పట్టించుకోలేదు

నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీరని అన్యాయం చేశారని తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల అన్నారు. కండ్ల ముందే 2లక్షల ఉద్యోగాలున్నా అరకొర నోటిఫికేషన్లతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఎనిమిదేండ్లుగా యువత జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారన్న ఆమె...  కేసీఆర్ పేరు చెప్పి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా..  దున్నపోతు మీద వానపడ్డట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న బిడ్డలను ఆదుకోవాలన్న సోయి కూడా కేసీఆర్ సర్కారుకు లేకుండాపోయిందని విమర్శించారు. బీజేపీ మాత్రం ఏం తక్కువ కాదన్న షర్మిల... రెండు కోట్ల ఉద్యోగాల పేరు చెప్పి, ఓట్లు కొల్లగొట్టి 10లక్షల ఉద్యోగాలు కూడా ఇయ్యలేదని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలనతోనే యువతకు న్యాయం జరుగుతుందని షర్మిల స్పష్టం చేశారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ముందు నుంచి కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారుని షర్మిల ఆరోపించారు. ఆమె తలపెట్టిన ప్రజాప్రస్థానం విరామం లేకుండా సాగుతోంది.  ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలకేంద్రంలో టీచర్లకు మద్దతుగా నిర్వహించిన ధర్నాలో షర్మిల పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సర్కారుపై విమర్శలు గుప్పించారు. సమస్యల పరిష్కారంపై ఏనాడూ సమీక్ష చేయలేదన్న ఆమె....  విద్యాశాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేసి, బదిలీలు, పదోన్నతులు కల్పించాలని..  బోధనేతర సిబ్బందిని నియమించి, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి, సమాన వేతనం ఇవ్వాలని, పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయాలని షర్మిల కోరారు. అంతే కాదు CPS రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్న షర్మిల... టీచర్లకు తమ పార్టీ (#YSRTelanganaParty) అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.