నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్

నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్

హైదరాబాద్: కేసీఆర్ కు సీఎం పదవిలో ఉండే అర్హత లేదని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక స్వార్థపరుడి చేతిలో నిరుద్యోగులు చనిపోతున్నారని.. అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆమె చెప్పారు. 1200 మంది ఆత్మబలిదానాల మీద అధికారాన్ని అనుభవిస్తున్న కేసీఆర్ కు పదవిలో ఉండే అర్హత లేదని.. ఆయన కుర్చీని కూల్చేస్తేనే తమ బిడ్డలకు ఉద్యోగాలొస్తాయని ప్రజలు భావిస్తున్నారని షర్మిల ట్వీట్ చేశారు. నిరుద్యోగులను చంపుతున్న కేసీఆర్ ఓ హంతకుడని దుయ్యబట్టారు. కన్నబిడ్డకు పదవి కట్టబెట్టడంలో ఉన్న ప్రేమ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో లేదని దెప్పి పొడిచారు. రైతులు, నిరుద్యోగులు చనిపోతున్నా దున్నపోతుపై వాన పడినట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోసం రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలని విమర్శించారు.