67 ఏండ్లున్న కేసీఆర్ సీఎం కావొచ్చు.. రైతులు మాత్రం బీమాకు అనర్హులా?

67 ఏండ్లున్న కేసీఆర్ సీఎం కావొచ్చు.. రైతులు మాత్రం బీమాకు అనర్హులా?

రైతు బీమా వయసును బట్టి ఎలా నిర్ణయిస్తారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రైతు బీమా వయసు పరిమితిని 59 ఏండ్లుగా నిర్ణయించడంపై ఆమె మండిపడ్డారు. 60 ఏండ్లు పైబడిన వారు రైతులు కాదా అని అడిగారు. అసలు రైతంటే ఎవరో కేసీఆర్ చెప్పాలని అన్నారు. భూమి ఉన్నవారు, పాసుబుక్కు ఉన్నవారు మాత్రమే రైతులా అని ప్రశ్నించారు. 67 ఏండ్లున్న కేసీఆర్ సీఎం కావొచ్చు కానీ 59 ఏండ్లు నిండిన రైతులు మాత్రం బీమాకు అనర్హులా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే వయసుతో సంబందం లేకుండా రైతుబీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

For More News..

కరోనా వ్యాక్సిన్ల బహిరంగ అమ్మకానికి డీసీజీఐ అమోదం

భారత దిగ్గజ హాకీ ప్లేయర్ చరణ్‌జిత్ సింగ్ కన్నుమూత

సక్సెస్‎ఫుల్ వీర్యదాత.. 138 మందికి దానం