
హైదరాబాద్, వెలుగు: భావితరాలకు పాఠాలు చెప్పే టీచర్ అభ్యర్థులపై కేసీఆర్ ప్రభుత్వం లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నానని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం 13,086 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తే లాఠీలతో కొడతారా అని మంగళ వారం ట్విట్టర్‌లో ప్రశ్నించారు. అసెంబ్లీ లో ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోరా అని నిలదీశారు. కొలువుల కోసం తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగులను కొట్టే హక్కు కేసీఆర్కు ఎక్కడదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా యువత రక్తాన్ని కండ్ల చూస్తారా అని ప్రశ్నించారు. 13,086 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.