రైతులకు పాడె కడుతున్న సర్కారు 

రైతులకు పాడె కడుతున్న సర్కారు 

హైదరాబాద్: పచ్చని పొలాల్లో ఉండాల్సిన రైతుకు సర్కారు పాడె కడుతోందని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. వడ్లు కొనకుండా అన్నదాతలను ముప్పుతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. అందుకే వరి వేసి ఉరి వేసుకునే బదులు, పంటలు వేయకుండా భూములను పడావు పెడుతున్నారని ఆమె ట్వీట్ చేశారు. కేసీఆర్ ది రైతు సంక్షేమ ప్రభుత్వం కాదని.. వ్యవసాయానికి ఘోరీ కట్టే ప్రభుత్వం అని దుయ్యబట్టారు. రైతులను కోటీశ్వర్లు చేశానని గప్పాలు కొట్టే దొర.. ఆ రైతుల ఆదాయం నెలకు రూ.1,697 మాత్రమేనని తెలుసుకోవాలన్నారు. ఒకసారి వడ్లు కొంటానంటరు, మరోసారి వడ్లు కొనేది లేదంటరని.. ఊసరవెల్లి రాజకీయాలతో రైతులు ఆగమైతున్నారని విమర్శించారు.