వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్.. పోలీసులకు హారతిచ్చి నిరసన

వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్.. పోలీసులకు హారతిచ్చి  నిరసన

హైదరాబాద్  లోటస్ పాండ్ లోని వైఎస్  షర్మిల ఇంటి దగ్గర టెన్షన్ పరిస్థితి కనబడుతోంది. షర్మిలను హౌజ్ అరెస్ట్ చేశారు. షర్మిల బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అయితే తనను అడ్డుకున్నందుకు నిరసనగా పోలీసులకు హారతి ఇచ్చి ఇంటి ముందు బైఠాయించారు షర్మిల.

ఇవాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పర్యటించనున్నారు షర్మిల. జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో పర్యటించాల్సి ఉంది. దళితబంధులో అక్రమాలు జరిగాయని ఇటీవల తీగుల్ గ్రామంలో ఆందోళనలు జరిగాయి. వాళ్లతో మాట్లాడేందుకు షర్మిల గజ్వేల్ వెళ్లాల్సి ఉంది. అయితే ఆమె బయటకు వెళ్లకుండా లోటస్ పాండ్ దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. 

షర్మిల పర్యటనను అడ్డుకుంటామని లోకల్ బీఆర్ఎస్ లీడర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో తన టూర్ కు భద్రత కల్పించాలని పోలీసులను షర్మిల కోరారు. సీఎం ఇలాకా లో జరిగిన అక్రమాలు భయటపడతాయని బీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుందన్నారు. నియోజకవర్గంలో ఓడిపోతాననే కేసీఆర్ తన పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని... ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన పోరాటం ఆగదన్నారు.