రైతు రుణమాఫీపై సీఎం పూటకో మాట : షర్మిల

రైతు రుణమాఫీపై సీఎం పూటకో మాట : షర్మిల

హైదరాబాద్, వెలుగు: రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్  పూటకో మాట మాట్లాడుతున్నారని వైఎస్సార్ టీపీ చీఫ్​ షర్మిల అన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులను బ్యాంకులు డిఫాల్టర్లుగా గుర్తిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. రూ.లక్ష మాఫీ చేయడానికి నాలుగేండ్లుగా కేసీఆర్  లక్ష మాటలు చెప్పారని, రుణాలు మాత్రం మాఫీ చేయలేదని సోమవారం ఆమె ట్వీట్  చేశారు. కేసీఆర్  బూటకపు హామీని నమ్మి ఓటేసిన రైతన్న.. నేడు బ్యాంకుల దగ్గర దోషిలా నిలబడాల్సి వస్తున్నదని ఆమె ఫైరయ్యారు. అన్నం పెట్టే రైతన్నకు నోటీసులు ఇవ్వడం తెలంగాణలోనే జరుగుతున్నదని విమర్శించారు. ‘‘రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు రైతుల ఇండ్ల మీద పడుతున్నారు. రైతు బంధు పైసలను వడ్డీల కింద జమ చేసుకుంటున్నారు. 20 లక్షల అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. దీంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంత జరిగినా  కేసీఆర్ కు చీమ కుట్టినట్లైనా లేదు” అని షర్మిల పేర్కొన్నారు. తక్షణం 31లక్షల మంది రైతులకు లక్షలోపు రుణాలు మాఫీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ALSO READ: రెండేండ్ల కింద ఆర్డర్.. బల్దియాకు చేరని స్వచ్ఛ వాహనాలు