చంద్రబాబు పాలనలో అభివృద్ధి 25 ఏళ్లు వెనక్కి : షర్మిల

చంద్రబాబు పాలనలో అభివృద్ధి 25 ఏళ్లు వెనక్కి : షర్మిల

చంద్రబాబు పాలనలో అభివృద్ధి 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు వైఎస్ షర్మిల. భూతద్దం పెట్టుకొని వెతికినా అభివృద్ధి జాడే కనిపించటం లేదన్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన బాబు… అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు షర్మిల.

బాబు అధికారంలోకి రావ‌డానికి మొత్తం రుణ‌మాఫీ అని వాగ్దానం చేసి అదే మొద‌టి సంత‌కం అవుతుంద‌ని చెప్పి.. ఎన్నిక‌ల అయిపోయిన త‌ర్వాత రుణ‌మాఫీ ఫైల్‌ పై సంత‌కం పెట్ట‌కుండా రుణ‌మాఫీకి క‌మిటీ వేస్తున్నాన‌ని సంత‌కం పెట్టారన్నారు. చంద్ర‌బాబు డ్వాక్రా మ‌హిళ‌ల‌కు మొత్తం రుణం మాఫీ చేస్తామ‌న్నారు. ఆ శాఖ‌కు చెందిన మంత్రి ప‌రిటాల సునీత అసెంబ్లీలో స‌మాధాన‌మిస్తూ మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫీ చేయ‌లేదన్నారు.  రూ.14వేల కోట్లు ఉన్న పోల‌వ‌రం ప్రాజెక్టు వ్య‌యాన్నిరూ.60వేల కోట్ల‌కు పెంచారని.. నామినేష‌న్ ప‌ద్ధ‌తిలో బాబుకు కావాల్సిన వాళ్ల‌కు కాంట్రాక్టులు ఇచ్చారని తెలిపారు. అందుకే కేంద్రం నుంచి పోల‌వ‌రాన్ని లాగేసుకున్న‌ది నిజం కాదా?. పోల‌వ‌రాన్ని 3 ఏళ్ల‌లో పూర్తి చేస్తామ‌ని మీరు చెప్ప‌లేదా చంద్ర‌బాబు?  నేటికి అది పూర్తి కాలేదంటే అది మీ అస‌మ‌ర్థ‌త కాదా?. అని  ప్రశ్నించారు షర్మిల.