పల్లె హాస్పిటల్స్ ప్రారంభం కాకముందే 104 సేవలు బంద్ చేస్తున్నరు 

పల్లె హాస్పిటల్స్ ప్రారంభం కాకముందే 104 సేవలు బంద్ చేస్తున్నరు 

కేసీఆర్ సర్కార్ పల్లె దవాఖానాల పేరిట 104 సేవలను బంద్ పెట్టాలని చూస్తోందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. పల్లె హాస్పిటల్స్ ప్రారంభం కాకముందే 104 సేవలను బంద్ చేస్తున్నారంటే మీకు ప్రజల ప్రాణాల మీదున్న ప్రేమ ఎలాంటిదో అర్ధమవుతోందని ఆమె ఎద్దేవా చేశారు. 

‘గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని YSR గారు 104 సేవలను ప్రవేశపెడితే, ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ఇప్ప‌టివ‌ర‌కు ప్రారంభించ‌ని పల్లె దవాఖానాల పేరిట 104 సేవలను బంద్ పెట్టాలని చూస్తోంది. మీరు ప్రవేశపెట్టిన కంటి వెలుగు కంటికి కనపడకుండా పోయింది, బస్తీ దవాఖానాలకు సుస్తీ చేసింది.

సర్కార్ దవాఖానలో సౌలతులు కరువైనయి. పల్లె హాస్పిటల్స్ ప్రారంభం కాకముందే 104 బందు చేస్తున్నారంటే మీకు ప్రజల ప్రాణాల మీదున్న ప్రేమ అంతులేనిది. సౌలతులు లేక, వైద్యం అందక సర్కార్ దవాఖానల్లో జనం కరోనాతో  చస్తుంటే సదుపాయాలు కల్పించలేనప్పుడే ప్రజల ప్రాణాల మీద మీకున్న ప్రేమ తెలిసిపోయింది’ అని షర్మిల ట్వీట్ చేశారు.