నిరుద్యోగ చావులన్నీ ప్రభుత్వ హత్యలే

నిరుద్యోగ చావులన్నీ ప్రభుత్వ హత్యలే

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోందని.. అయినా కేసీఆర్ దున్నపోతు మీద వానపడినట్లు నోటిఫికేషన్లు భర్తీ చేయడం లేదని షర్మిల విమర్శించారు. ‘నిరుద్యోగుల చావుకు నిరుద్యోగమే కారణం. ఈ నిరుద్యోగానికి కేసీఆర్ కారణం. నిరుద్యోగ చావులన్నీ ప్రభుత్వ హత్యలే. నిరుద్యోగుల చావులకు కారణమవుతున్న కేసీఆర్ ముఖ్యమంత్రి పదివికి అనర్హుడు. ఉద్యోగాలు నింపడం చేతకాని సీఎం వెంటనే రాజీనామా చేయాలి. రాష్ట్రంలో  రోజుకో నిరుద్యోగి ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకుంటుంటే.. దున్నపోతు మీద వానపడినట్లు కేసీఆర్ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నా , నిరుద్యోగులు చస్తున్నా .. చచ్చేది నా వాడు కాదు కదా అంటున్న కేసీఆరే ఈ చావులకు కారకుడు’ అని షర్మిల ఆరోపించారు.