సాక్షిలో నాకు సగభాగం..ఇది మా నాన్న నిర్ణయం: షర్మిల

సాక్షిలో నాకు సగభాగం..ఇది మా నాన్న నిర్ణయం: షర్మిల

సాక్షి సంస్థలో తనకు సగ భాగముందన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. సాక్షి పేపర్లో తనపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు..జగన్ కు ,తనకు సమాన భాగం ఉండాలని  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడే నిర్ణయించారని చెప్పారు. ఆ విషయం మరిచిపోయి సాక్షి తనపై ఇష్టానుసారంగా వార్తలు రాస్తోందని మండిపడ్డారు.   వైఎస్సార్ సీపీ  నేతలు  ఏం రాసినా.. ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ విసిరారు షర్మిల. రోజుకో జోకర్ ని దించి తనపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు.తనపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు ఇంత దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

తాను వైఎస్సార్ రక్తాన్ని.. ఎవరు కాదన్నా..ఔనన్నా  వైఎస్ షర్మిలా రెడ్డిని అని చెప్పారు. ఏపీ ప్రజల హక్కుల కోసం కొట్లాడుతా..నిలబడుతా..   ఏపీకి ప్రత్యేక హోదా , పోలవరం వచ్చే వరకు వెనకడుగు వేయబోనని చెప్పారు. జగన్ మూడు రాజధానులని  ఏపీకి ఒక్క రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేని విమర్శించారు.