బ్రిటీష్ వాళ్లకు సీఎం కేసీఆర్ కు పెద్ద తేడా లేదన్నారు వైఎస్సార్ టీపీ అధ్య క్షురాలు వైఎస్ షర్మిల. బ్రిటీష్ వాళ్లు తెల్లదొరలైతే.. .కేసీఆర్ నల్లదొర అని విమర్శించారు. లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు షర్మిల. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదన్నారు. రాష్ట్రంలో వైన్స్, బెల్ట్ షాప్ లు పబ్ ల సంఖ్య పెరిగిపోతుందన్నారు. కేసీఆర్ 38 వేల ఎకరాల భూములను అమ్మిండని ఆరోపించారు. మద్యం దుకాణాలతో రాష్ట్రాన్ని నడుపుతున్నాడని విమర్శించారు.30 లక్షల మందికి రాష్ట్రంలో ఇళ్లు లేవన్నారు. మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
విభజించు పాలించు అనే విధంగా కేంద్రం పాలన ఉందన్నారు షర్మిల. కేంద్ర ప్రభుత్వం విభజించు పాలించు అనే విధంగా పరిపాలిస్తుందని విమర్శించారు వైఎస్ షర్మిల. మణిపూర్ ఘటన బాధాకరమని..ఇప్పటి వరకు 60 వేల మంది నిరాశ్రయులయ్యారని ధ్వజమెత్తారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు షర్మిల.