పార్టీలోకి ఈటలను ఆహ్వానించిన వైఎస్ షర్మిల

V6 Velugu Posted on Jun 09, 2021

YS రాజశేఖర్ రెడ్డి పేరుతోనే YSR తెలంగాణ పార్టీ ఉంటుందన్నారు YS షర్మిల. బుధవారం పార్టీ నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు.  టేబుల్ ఫ్యాన్ గుర్తుపై ప్రచారాన్ని ఖండించారు. అదంతా ఫూలిష్ ప్రచారం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు గుర్తు ఎంపికపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని.. పార్టీ విధి,విధానాలు రూపొందిస్తామన్నారు. ప్రజల అజెండాను తమ పార్టీ అజెండా అని షర్మిల స్పష్టం చేశారు.

మరోవైపు  మాజీ మంత్రి ఈటల వస్తానంటే  తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని షర్మిల అన్నారు. కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అని అన్నారు. కేసులకు భయపడి బీజేపీలో చేరడం కూడా కామన్ అయిపోయిందన్నారు. ఇప్పటి వరకు ఈటల విషయంలో తమ పార్టీలో ఎటువంటి చర్చ లేదని చెప్పారు YS షర్మిల.

Tagged YS Sharmila, etela, invited, party

Latest Videos

Subscribe Now

More News