జులై 8న YSR తెలంగాణ పార్టీ ఆవిర్భావం

జులై 8న YSR తెలంగాణ పార్టీ ఆవిర్భావం

YSR తెలంగాణ పార్టీ పేరుతో వైఎస్ షర్మిల పార్టీని స్థాపించబోతున్నారు. ఇప్పటికే ఈ పేరులో కేంద్ర ఎన్నికల సంఘానికి రిజిస్ట్రేష‌న్ చేయించారు. తెలంగాణలో పార్టీ పెడ‌తాన‌ని, రాజ‌న్న రాజ్యం తీసుకొస్తాన‌ని షర్మిల ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేశారు. ఆమె పెట్ట‌బోయే పార్టీ పేరు, పార్టీ విధి విధానాల‌పై ఇప్ప‌టికే అనేక ఊహాగానాలు వ‌చ్చాయి. ఆమె పార్టీ పేరు YSR TP అని.. జులై 8న ఆమె ప్ర‌క‌టిస్తార‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రిగింది. చివ‌ర‌కు YSR తెలంగాణ పార్టీగా త‌మ పార్టీ పేరును ష‌ర్మిల రిజిస్ట్రేష‌న్ చేయించారు.

ఈ ప్ర‌క్రియ నేటితో ముగిసిన‌ట్లు అధికారికంగా ప్ర‌కట‌‌న వ‌చ్చింది. ఆ పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త రాజ‌గోపాల్ దీనిపై ఓ ప్ర‌క‌ట‌న చేస్తూ... పార్టీ పేరుపై తన‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఎన్నికల‌ సంఘానికి వైఎస్ విజ‌య‌మ్మ లేఖ రాశార‌ని చెప్పారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, దివంగ‌త నేత‌ YS రాజశేఖర్‌రెడ్డి జయంతి సంద‌ర్భంగా జులై 8న కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్న‌ట్లు ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇప్పటి వరకూ పార్టీ పేరుపై ఎటువంటి అభ్యంతరాలు రాలేదని చెప్పారు.