కర్నూలుకు విజయమ్మ.. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యంపై ఆరా

కర్నూలుకు విజయమ్మ.. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యంపై ఆరా

ఏపీ సీఎం జగన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి కర్నూలు వెళ్లారు.అవినాశ్రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఆమె పరామర్శించారు. అవినాశ్‌ను అడిగి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. అవినాశ్ చుట్టూ కర్నూలులో టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆమె కర్నూలు వెళ్లడం గమనార్హం.

19న అవినాశ్ రెడ్డి తల్లికి అస్వస్థత

ఈ నెల 19వ తేదీన  పులివెందులలో  శ్రీలక్ష్మి  అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్సకు హైద్రాబాద్ కు తరలించాలని భావించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఈ నెల19న సీబీఐ విచారణకు వెళ్లకుండా పులివెందులకు బయలుదేరారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు  వైఎస్ అవినాష్ రెడ్డి న్యాయవాదులు.

శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై విజయమ్మ ఆరా

పులివెందులకు  వెళ్తున్న వైఎస్ అవినాష్ రెడ్డికి అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద తల్లి వస్తున్న అంబులెన్స్ ఎదురైంది. అదే అంబులెన్స్లో  కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రిలో శ్రీలక్ష్మిని  చేర్పించారు. అనారోగ్యంగా  ఉన్న  శ్రీలక్ష్మిని సోమవారం(మే 22) సాయంత్రం వైఎస్ విజయమ్మ పరామర్శించారు. హైద్రాబాద్ నుండి వచ్చిన వైఎస్ విజయమ్మ  కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రికి  చేరుకుని  వైఎస్ లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

హెల్త్ బులిటెన్ రిలీజ్

మరోవైపు అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు తాజా బులిటెన్ రిలీజ్ చేశారు. ఆమెకు పరిస్థితి బాగలేదని తెలిపారు. రెండు కవాటాలూ పని చేయట్లేదని తెలిపారు. ఆమెకు లోబీపీ ఉందనీ... ఐసీయూలోనే ఉంచి ట్రీట్‌మెంట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఇక నిన్న(మే20) అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నాననీ... తనకు 10 రోజులు టైమ్ కావాలని ఆ లేఖలో అవినాష్ పేర్కొన్నారు.