వైఎస్ వివేకా హత్యకేసు నిందితులకు నార్కో, లై డిటెక్టర్ పరీక్షలు

వైఎస్ వివేకా హత్యకేసు నిందితులకు నార్కో, లై డిటెక్టర్ పరీక్షలు

కడప జిల్లా : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు దుద్దికుంట శేఖర్ రెడ్డిని మరో మారు అదుపులోకి తీసుకుంది సిట్. డీఎస్పీ కార్యాలయంలో ప్రశ్నించింది. శేఖర్ రెడ్డికి నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షల కోసం అనుమతి ఇవ్వాలని పులివెందుల కోర్టులో పిటిషన్ వేసింది సిట్ బృదం.

నార్కో అనాలిసిస్ పరీక్షలకు కోర్టు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. పరీక్షల కోసం నిందితులను హైదరాబాద్ కు తరలిస్తామని పోలీసులు చెప్పారు. మరో రెండు రోజుల్లో ఎర్ర గంగిరెడ్డి, క్రిష్ణారెడ్డిలను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్నారు.