బెట్టింగ్ యాప్స్ కేసు: మంచు లక్ష్మిని మూడున్నర గంటలు ప్రశ్నించిన ఈడీ

బెట్టింగ్ యాప్స్ కేసు: మంచు లక్ష్మిని మూడున్నర గంటలు  ప్రశ్నించిన ఈడీ

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో  మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. దాదాపు మూడున్నర  గంటల పాటు మంచు లక్ష్మిని విచారించారు ఈడీ అధికారులు.  ఐదేళ్ల బ్యాంక్ స్టేట్ మెంట్స్ ను  ఈడీకి అందజేశారు మంచు లక్ష్మీ. ఈ సందర్భంగా విచారణలో  మంచు లక్ష్మి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసుకుంది ఈడీ. 

ఇవాళ బుధవారం (ఆగస్టు 13న) విచారణలో భాగంగా మంచు లక్ష్మీ ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈజీగా డబ్బు సంపాదించొచ్చు అంటూ పలు గేమింగ్‌ యాప్‌లను సోషల్‌ మీడియాలో మంచు లక్ష్మీ ప్రమోట్‌ చేసింది. ఈ క్రమంలో  మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద మంచు లక్ష్మీ ఇచ్చే వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.  బెట్టింగ్ యాప్ ల నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్ లపై ఈడీ అరా తీసినట్టు సమాచారం. చట్టవిరుద్ధమైన యాప్ లకు ప్రమోషన్ ఎందుకు చెయ్యాల్సి వచ్చింది..? అనే కోణంలో ఈడీ విచారించింది. 

ALSO READ :  'కూలీ' పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్..

ఇప్పటికే, ఇదే కేసులో ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్‌ రాజ్‌ హాజరైన విషయం తెలిసిందే. ప్రకాశ్‌ రాజ్‌ను 6 గంటలు, విజయ్‌ దేవరకొండను 4 గంటలపాటు విచారించారు ఈడీ అధికారులు.