
జగిత్యాల జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసిన వివేక్ వెంకటస్వామి.. ఆయన విగ్రహావిష్కరణకు రావడం సంతోషంగా ఉందన్నారు. వీ6, వెలుగు ఛానల్ ఏర్పాటు చేసినప్పుడు సర్దార్ పాపన్న గురించి మంచి ఆర్టికల్ రాశామని చెప్పారు. సర్దార్ పాపన్న ఒక గొప్ప వీరుడని చెప్పారు. ఈ
అంతకు ముందు జగిత్యాల పద్మనాయక ఫంక్షన్ హాల్ లో జీవన్ రెడ్డి తమ్ముడు తాటిపర్తి దేవేందర్ రెడ్డి -విజయలక్ష్మి దంపతుల కూతురు వినూత్న రెడ్డి వివాహ వేడుకకు హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
వధూవరులను ఆశీర్వదించారు.
ALSO READ : ORR గోడలపై కనిపించిన హార్ట్ టచింగ్ ‘ఆర్ట్’..
అంచెలంచెలుగా ఎదిగిన వీరుడు
సర్వాయి పాపన్న 17వ శతాబ్దంలో మొఘల్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. కొందరు సర్వాయి పాపన్న గౌడ్ అని కూడా అంటారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అంచెలంచెలుగా ఎదిగి ఒక వీరుడిగా మారారు.పాపన్న గౌడ్ పోరాటాలు అణగారిన వర్గాల ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఆయన ధైర్యసాహసాలు, ప్రజా పోరాటాలు తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాయి. ఇప్పటికీ ఆయనను ఒక వీరుడిగా పోరాట నాయకుడిగా స్మరించుకుంటారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇతని విగ్రహాలు, స్మారక చిహ్నాలు కనిపిస్తాయి.