రెండు మార్కులు తక్కువ వేసినందుకు.. మహిళా టీచర్ను చితకబాదిన స్టూడెంట్

 రెండు మార్కులు తక్కువ వేసినందుకు.. మహిళా టీచర్ను  చితకబాదిన స్టూడెంట్

మార్కులు తక్కువగా వస్తే టీచర్ స్టూడెంట్ ను కొట్టడం చూశాం. అయితే  రెండు మార్కులు తక్కువ వేశారని టీచర్ నే చితక బాదాడు ఓ విద్యార్థి. క్లాస్ రూంలోనే  టీచర్ పై  పిడిగుద్దులతో రెచ్చిపోయాడు. టీచర్ ను  తన్నుతూ..ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు విద్యార్థి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్  అయింది.  ఆగస్టు 5న థాయ్ లాండ్ లో జరిగిన ఈ ఘటన  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
 అసలేం జరిగిందంటే.?   ఉతై థాని ప్రావిన్స్‌లోని ఒక పాఠశాలలో మిడ్ టర్మ్ ఎగ్జామ్ రాసిన ఓ 17 ఏళ్ల విద్యార్థి తనకు మ్యాథ్స్ ఎగ్జామ్   వచ్చిన మార్కులతో అసంతృప్తి చెందాడు. తనకు 20 మార్కులకు 18 మార్కులు వచ్చాయి. తాను అన్ని ప్రశ్నలకు   కరెక్ట్ సమాధానం  రాసినప్పుడు రెండు మార్కులు  ఎందుకు తక్కువ వేశారని  మహిళా టీచర్ ను ప్రశ్నించాడు విద్యార్థి. అయితే అసైన్ మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం అతను తన పనిని పూర్తిచేయడం విఫలం అయ్యాడని టీచర్ బదులిచ్చింది. టీచర్  తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని  ఫుల్ మార్కులు వేయాలని విద్యార్థి పట్టుబట్టాడు. దీనికి ఆ టీచర్ ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన స్టూడెంట్ ఆ మహిళా టీచర్ పై పంచ్ ల వర్షం కురిపించాడు. ఇష్టం వచ్చినట్టు పిడిగుద్దుల గుద్దాడు. కాలుతో తన్నాడు. తర్వాతో మరో టీచర్ జోక్యం చేసుకోవడంతో అతను కొట్టడం ఆపేశాడు.  

►ALSO READ | చైనాలో చికెన్ గున్యా కొత్త వైరస్ : దోమలపై డ్రోన్లతో యుద్ధం : ప్రపంచానికి ప్రమాదం ఉందా..?

ఈ ఘటనలో ఆ మహిళా టీచర్ కు కళ్లు, తల,పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో టీచర్ ఫిర్యాదు మేరకు ఆ స్టూడెంట్ ను స్కూల్ నుంచి సస్పెండ్ చేసింది యాజమాన్యం. ఈ ఘటనపై విద్యార్థిని విచారిస్తామని పోలీసులు తెలిపారు.