ఒప్పో రెనో 14 వచ్చేసిందిగా : AI ఫీచర్స్, గేమింగ్‌, ఫోటో ఎడిటింగ్‌కి బెస్ట్ ఇదే !

ఒప్పో రెనో 14 వచ్చేసిందిగా : AI ఫీచర్స్, గేమింగ్‌, ఫోటో ఎడిటింగ్‌కి బెస్ట్ ఇదే !

చైనా ఎలక్ట్రానిక్స్ & టెక్ కంపెనీ ఒప్పో రెనో 14ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సాధారణ స్మార్ట్ ఫోన్ కాదు అద్భుతమైన కెమెరా సెటప్, 6000mAh బ్యాటరీ, లేటెస్ట్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్, 12జిబి ర్యామ్ ఇంకా చాల ఫీచర్లతో వస్తుంది. అయితే ఫోన్ ధర ర్యామ్, స్టోరేజ్ బట్టి రూ. 37,999 నుండి రూ. 42,999 వరకు ఉంటుంది. 

డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఒప్పో రెనో 14 మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది. 7.42mm సన్నగా, 187 గ్రాముల బరువు ఉంటుంది. దీనికి వెల్వెట్ టెక్స్చర్ గ్లాస్ బ్యాక్‌ ఇచ్చారు. బ్యాక్ కెమెరా సెటప్ R-ఆకారంలో ట్రిపుల్ LED ఫ్లాష్‌తో ఉంటుంది. వాటర్-డస్ట్ రిసిస్టెంట్ తో IP68, IP69 రేటింగ్‌తో వస్తుంది, అంటే దుమ్ము, నీరు పడ్డ సురక్షితంగా ఉంటుంది.

ఇక స్పెసిఫికేషన్లు చూస్తే 
డిస ప్లే: OPPO Reno 14 లో 6.59-అంగుళాల ఫ్లాట్ AMOLED స్క్రీన్, 2760 x 1256 పిక్సెల్స్  FHD+ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 

పర్ఫార్మెన్స్ : ఒప్పో రెనో 14 5G ఫోన్ మీడియాటెక్ కొత్త డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో 4nm ప్రాసెస్‌పై నిర్మించారు.  3GHz వరకు క్లాక్ స్పీడ్‌, ఇందులోని చిప్‌సెట్ 1.4 మిలియన్లకు పైగా AnTuTu స్కోర్‌ సాధించింది అంటే మిడ్-రేంజ్ పర్ఫార్మెన్స్ లో  బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా గేమింగ్,  PUBG వంటి మల్టీ టాస్కింగ్‌ను స్మూత్ గా చేయవచ్చు. 

ఈ స్మార్ట్‌ఫోన్ LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీతో 12GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్‌ అందిస్తుంది. మొత్తం మీద పర్ఫార్మెన్స్ చూస్తే ప్రతిరోజు వాడేందుకు బాగుంటుంది. 

కెమెరా: రెనో 14 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP సోనీ ప్రైమరీ సెన్సార్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP JN5 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ ఉంది. వీటితో పగటిపూట ఫోటోలు స్పష్టంగా, కలర్ ఫుల్ గా వస్తాయి. నైట్ మోడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. 

ఆపరేటింగ్ సిస్టమ్: ఒప్పో రెనో 14 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15  కలర్‌ఓఎస్ 15 పై నడుస్తుంది. కలర్‌ఓఎస్ కొత్త వెర్షన్ క్లీన్, స్మూత్ ఇంకా  కస్టమైజ్ ఇంటర్‌ఫేస్‌ అందిస్తుంది.

OPPO Reno 14 స్మార్ట్‌ఫోన్‌లో ఆబ్జెక్ట్ ఎరేజర్, రీకంపోజ్, బెస్ట్ ఫేస్, పర్ఫెక్ట్ షాట్, రిఫ్లెక్షన్ రిమూవర్ వంటి AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్స్ ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా చూస్తే రెనో 14లో AI లింక్‌బూస్ట్ 3.0 టెక్నాలజీ ఉంది. 

బ్యాటరీ & ఛార్జింగ్: ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో వస్తుంది, దీనిబట్టి చూస్తే ఎక్కువ గంటల బ్యాకప్‌ ఉంటుంది. 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌ ఫోన్‌ను నిమిషాల్లో ఛార్జ్ చేయగలదు.