దొరగారికి రైతుల బాధలు నెత్తికెక్కడంలేదా?  ఐకేపీ కేంద్రాల దగ్గర వైఎస్సార్టీపీ ధర్నా

దొరగారికి రైతుల బాధలు నెత్తికెక్కడంలేదా?  ఐకేపీ కేంద్రాల దగ్గర వైఎస్సార్టీపీ ధర్నా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిళ రెచ్చిపోయారు. కేసీఆర్ పై తీవ్రవిమ‌ర్శలు చేశారు. రైతు పండించిన ప్రతిగింజా కొనుగోలు చేయలని డిమాండ్ చేస్తూ బుధవారం (మే10)న IKP కేంద్రాల వద్ద YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగాధర్నా కు ఆమె పిలుపునిచ్చారు.  

కేసీఆర్ దొర నీగుండె కరగదా  ?

కేసీఆర్ దొర నీ గుండె కరగడం లేదా కేసీఆర్ దొరా?    ఇదేనా కిసాన్ సర్కారు అంటే?   అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..సీఎం కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు ఎండనకా, వాననకా రైతులు కొనుగోలు సెంటర్లలో పడిగాపులు కాస్తుంటే.. గడీల్లో దర్జాగా బ్రతకడమా? పెద్ద రైతును అని చెప్పుకునే స్వయం ప్రకటిత మేధావికి..  రైతుల బాధలు నెత్తికెక్కడం లేదా? అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.  అప్పుల పాలైన రైతన్నలు రోదిస్తుంటే.. వచ్చిన అరకొర దిగుబడిపైనా కోతలా?  మిల్లర్లు, వ్యాపారులు క్వింటాకు 12 కిలోల తరుగు తీసి, రైతుల పొట్టుకొడుతున్నా మౌనం వీడవా?.. చెమటోడ్చి పండించిన పంట కాలువల్లో తేలిపోతుందని ఆగ్రహించారు. చేతులతో ఎత్తుకోలేక, కల్లాల్లో రైతు కన్నీరు పెడుతున్నారని.. KCR దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా?అని నిలదీశారు వైఎస్ షర్మిల.

ఎన్నిరోజులు మీ జూటా మాటలు? వడ్లు కొంటామని చెప్పి నెలరోజులైనా కొన్నవడ్లు ఎన్ని? నీ రాజకీయాలకు రైతులు ఇంకెన్ని రోజులు గోస పెడ్తరు?అప్పులు తేవడానికి అధికారులను పరుగులు పెట్టిస్తున్న మీరు….పంట కొనుమని అధికారులను ఎందుకు కల్లాలకు పంపడం లేదు? అని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. ఇప్పటికైనా రైతును గోస పెట్టకుండా చూడండని.. తడిచిన ధాన్యానికి కొర్రీలు పెట్టకుండా,కల్లాల్లో ధాన్యాన్ని మద్దతు ధరిచ్చి అంతా కొనాలని డిమాండ్ చేస్తున్నామన్నారు వైఎస్ షర్మిల.