వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు మళ్ళీ తెలంగాణలో అమలు కావాలె : వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు మళ్ళీ తెలంగాణలో అమలు కావాలె : వైఎస్ షర్మిల

ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం రావాలని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజక వర్గంలో కొనసాగుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న షర్మిలకు బట్వాన్ పల్లి, మన్నేగూడేం, పెర్కపల్లి గ్రామాల్లో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ సర్కార్ ఇళ్లులు కట్టే ప్రభుత్వం కాదని, పేదలకు పెన్షన్ ఇచ్చేది కాదని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది కాదని విమర్శించారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు మళ్ళీ తెలంగాణలో అమలు కావాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ ప్రజలకోసమే బ్రతికాడని, ప్రజల కోసమే చనిపోయాడని తెలిపారు. 

వైఎస్ఆర్ ప్రభుత్వం తేవడమే లక్ష్యంగా పెట్టిన పార్టీ వైఎస్ఆర్టీపీ అని షర్మిల స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇళ్లులు మంజూరు చేయాలన్న ఆమె... ఇంట్లో ఎంత మంది వృద్దులుంటే అంతమందికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్, అరోగ్య శ్రీ పథకాలకు పునర్వైభవం రావాలన్నారు.  వైఎస్సార్ లా ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.