వైసీపీకి మరో ఎంపీ రాజీనామా - టీడీపీలో చేరే ఛాన్స్..!

వైసీపీకి మరో ఎంపీ రాజీనామా - టీడీపీలో చేరే ఛాన్స్..!

2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు అభ్యర్థుల జాబితా ప్రకటించటంతో ఇరు వర్గాల్లో అసమ్మతి సెగ రాజుకుంటోంది. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీలో రాజీనామాల పర్వం ఊపందుకుంది. సీటు దక్కని వారు, తాము ఆశించిన చోట స్థానం దక్కని వారు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ లిస్ట్ లో చేరారు. 2019లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచిన మాగుంట, ఈ సారి నియోజకవర్గ ఇంఛార్జిల లిస్ట్ లో స్థానం దక్కకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది.ఇప్పటికే టీడీపీ నేతలతో మాగుంట టచ్ లో ఉన్నట్లు, చంద్రబాబు నుండి ఆయనకు హామీ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా ప్రకటించిన త్వరలోనే మంచిరోజు చూసుకొని టీడీపీలో చేరతారని సమాచారం. తన కొడుకు భవిష్యత్తు కోసమే మాగుంట టీడీపీలో చేరేందుకు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

ఒంగోలు ఎంపీ స్థానం తనని కాదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కేటాయించటమే మాగుంట రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే, ఇటీవల ప్రకటించిన తొలి జాబితా కారణంగా టీడీపీలో అసమ్మతి ఎక్కువైన నేపథ్యంలో మాగుంటకు సెకండ్ లిస్ట్ లో చోటు దక్కుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. 

Also Read :ఏపీలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు