బీజేపీ, బీఆర్ఎస్ ల అక్రమ మైత్రి ఎంతదాచినా దాగదు: షర్మిల

బీజేపీ, బీఆర్ఎస్ ల అక్రమ మైత్రి ఎంతదాచినా దాగదు: షర్మిల

బీఆర్ఎస్ ,బీజేపీ ఒక్కటేనన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బీజేపీ ముఖ్యమంత్రులు నెలల తరబడి ఎదురుచూస్తున్నా దొరకని అమిత్ షా అపాయింట్ మెంట్ కేటీఆర్ కు గాలికంటే వేగంగా కేటీఆర్ కు ఎలా దొరికిందని ప్రశ్నించారు.   కుళ్లు కాయలను బంగారు సంచిలో దాచినా కంపు బయటపడినట్లు.. బీజేపీ, బీఆర్ఎస్ ల దోస్తీ ఎంతదాచినా దాగదన్నారు.   గల్లీలో సిగపట్లు, ఢిల్లీలో కౌగిలింతలు .. నిజం కాదని  నిరూపించగలరా?  అని ప్రశ్నించారు.

బీహార్ లో జరిగిన బీజేపీయేతర పక్షాల సమావేశానికి బీఆర్ఎస్ ను ఎందుకు  ఆహ్వానించలేదో  చెప్పే దమ్ముందా  అని కేటీఆర్ ను  ప్రశ్నించారు షర్మిల. బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీపై కేసీఆర్ తీరు సరిగా లేదని  చెప్పేశారని..   మరోవైపు శరద్ పవార్ అయితే ఏకంగా బీజేపీ ,బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పారన్నారు . లిక్కర్ కేసులో  కవితను   నాలుగుసార్లు ఆఫీసుల చుట్టూ తిప్పిన సీబీఐ ఆమెను అరెస్టు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు  అసలు జాబితాలో ఆమె పేరే ఉండకపోవడమేంటని.. ఆమె కడిగిన ముత్యమా.. లేక బీజేపీతో బీఆర్ఎస్ ది కుదిరిన బంధమా? అని అన్నారు. 

తెలంగాణ మంత్రుల మీద ఈడీ దాడులుంటాయి కానీ ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు షర్మిల.   కాళేశ్వరం మీద తాను నిరంతరం పోరాటం చేస్తున్నా బీజేపీ మంత్రులు పనికిమాలిన ప్రకటనలు చేస్తారు తప్ప చర్యలు తీసుకోరన్నారు. సిగ్గులేకుండా, ఆత్మలు అమ్ముకుని చేతులు కలుపుతున్న బీఆర్ఎస్,బీజేపీ నీచక్రీడలను నాలుగు కోట్ల ప్రజలు గమనిస్తున్నారని ధ్వజమెత్తారు.

ALSO READ:కాంగ్రెస్ అనేది ఒక పెద్ద ప్యాకేజ్ పార్టీ : విజయశాంతి