కేసీఆర్ కొడుకు అంటే కేటీఆర్ కి ఎందుకు నామోషీ

కేసీఆర్ కొడుకు అంటే కేటీఆర్ కి ఎందుకు నామోషీ

తెలంగాణలో సీఎం కేసీఆర్ పెద్ద దొర..చిన్న దొర కేటీఆర్ అని అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఆడవాళ్లు ఉద్యమాలు చేస్తే చిన్న దొర జీర్ణించుకోలేక పోతున్నాడన్నారు. లక్ష 91 వేల మందికి.. కేసీఆర్ కొడుకుని.. కేసీఆర్ కొడుకు అంటే నచ్చలేదట అని అన్నారు. ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో నిరుద్యోగ నిరాహార దీక్ష  చేసిన ఆమె..ఈ సందర్భంగా మాట్లాడారు.

అమెరికా నుండి కొడుకుని తీసుకువచ్చి రెండు మంత్రి పదవులు కేసీఆర్ అప్పజెప్పారని అని అన్నారు వైఎస్ షర్మిల. కేసీఆర్ కొడుకు అంటే కేటీఆర్ కి ఎందుకు అంత నామోషీ అని ప్రశ్నించారు. చిన్న దొర జిల్లా కి వస్తున్నాడంటే ప్రతి ప్రక్షాలను.. ప్రశ్నించే జర్నలిస్టుల పై కేసులు పెడుతున్నారని తెలిపారు. నెరేళ్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అడిగితే థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారన్నారు.రాష్ట్రం మొత్తం గుట్కా నిషేధం.. కానీ ఇక్కడ మాత్రం నడుస్తోంది..దానికి పోలీస్ ల మద్దతు ఉందన్నారు. లంచాలు ఇవ్వలేక ఓ మహిళ పుస్తెల తాడు తహశీల్దార్ కార్యాలయానికి కట్టి పెద్ద దొర, చిన్న దొరకి తగిన బుద్ధి చెప్పిందన్నారు.