వెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావు: వైఎస్ షర్మిల

వెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావు: వైఎస్ షర్మిల

'ఎవడు చస్తే నాకేంటని వెంట నడిచినోళ్ళను.. వెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావ్' అంటూ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. కార్యకర్తలకు బహిరంగలేఖ రాయడంపై ముఖ్యమంత్రిపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. 

"ఎవడు చస్తే నాకేంటని వెంట నడిచినోళ్ళను, వెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావ్. సకల జనులను మోసం చేశావ్.. కానీ ఇప్పుడు నీ పీఠం కదులుతుందని లిక్కర్ మరకల్లో బిడ్డ జైలుకు పోతుందని.. పేపర్ లీకేజీ వ్యవహారం అధికార శాపం అయ్యేసరికి ఎన్నికలు వస్తున్నాయని ఎత్తులు వేస్తున్నావా కేసీఆర్. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పడు..నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పడు..ఉద్యమ కారులకు అన్యాయం జరిగినప్పుడు..మీ పార్టీ సర్పంచ్ లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు ఒక్క నాడైనా ఆత్మహత్యలు చేసుకోకండి అని ఒక్కరికైనా లెటర్ రాసావా?" అని షర్మిల ప్రశ్నించారు.

"బిడ్డ జైలుకు పోయే సమయం వచ్చే సరికి కేసీఆర్ కు కార్యకర్తలు గుర్తుకు వచ్చారు. కార్యకర్తల బలం గుర్తుకు వచ్చింది. తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చింది. ఆత్మీయ సందేశం అని.. మొసలి కన్నీరు కారుస్తూ ఓపెన్ లెటర్లు రాస్తున్నాడు. నువ్వు ఎన్ని లెటర్లు రాసిన.. ఎన్ని కుప్పిగంతులు వేసినా.. నీ పాపం పండింది. రేపు ఎన్నికల్లో నీ పాపానికి పరిహారం చెల్లించుకొనుడే.. నువ్వు నీ ఫ్యామిలీ జైలుకు పోవుడే" అని షర్మిల జోస్యం చెప్పారు.